Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రేమ పేరుతో మోసం చేశారంటూ యువతి ఆందోళన

Author
Posted By Telangana Gontuka
| 05 Oct 2026, 03:53 PM | TELANGANA
ప్రేమ పేరుతో మోసం చేశారంటూ యువతి ఆందోళన

వరంగల్: వర్ధన్నపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి ఇంటి ఎదుట ఓ యువతి ఆందోళనకు దిగింది. ఛైర్మన్‌ కుమారుడు శ్రీకాంత్‌ ప్రేమ పేరుతో తనను శారీరకంగా లోబరుచుకుని, మూడు సార్లు అబార్షన్లు చేయించాడని యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ప్రస్తుతం పెళ్లి చేసుకోకుండా దాటవేస్తూ తనను మోసం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన సమస్యను పరిష్కరించి, తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఛైర్మన్‌ ఇంటి ఎదుట నిరసన చేపట్టింది.
యువతి ఆందోళన విషయం తెలుసుకున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు, పలువురు స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెకు సంఘీభావం తెలిపారు. తనకు జరిగిన విషయంపై ఇప్పటికే ఎమ్మెల్యేను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరినా సమస్య పరిష్కారం కాలేదని యువతి కుటుంబసభ్యులు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి యువతి సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని వారు కోరారు. యువతి చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రేమ పేరుతో మోసం చేశారంటూ యువతి ఆందోళన - Additional Image