ప్రేమ పేరుతో మోసం చేశారంటూ యువతి ఆందోళన
వరంగల్: వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ఎదుట ఓ యువతి ఆందోళనకు దిగింది. ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ ప్రేమ పేరుతో తనను శారీరకంగా లోబరుచుకుని, మూడు సార్లు అబార్షన్లు చేయించాడని యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ప్రస్తుతం పెళ్లి చేసుకోకుండా దాటవేస్తూ తనను మోసం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన సమస్యను పరిష్కరించి, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఛైర్మన్ ఇంటి ఎదుట నిరసన చేపట్టింది. యువతి ఆందోళన విషయం తెలుసుకున్న బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు, పలువురు స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెకు సంఘీభావం తెలిపారు. తనకు జరిగిన విషయంపై ఇప్పటికే ఎమ్మెల్యేను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరినా...