Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

"అందరి నాయకుడిగా పేరొందిన అబ్బిడి రాజిరెడ్డి"...!

"అందరి నాయకుడిగా పేరొందిన అబ్బిడి రాజిరెడ్డి"...!

వర్ధన్నపేట: అందరినీ కలుపుకొని ముందుకు సాగే నాయకుడిగా అబ్బిడి రాజిరెడ్డి స్థానికంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. దమ్మన్నపేట గ్రామానికి చెందిన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ గెలుపు కోసం అబ్బిడి రాజిరెడ్డి అహర్నిశలు కృషి చేశారు. అనంతరం వర్ధన్నపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, ప్రజా సమస్యలపై నిర్వహించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉన్నారు. రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీ కోసం పనిచేసిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.
#ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజుకు సన్నిహితంగా...!
ప్రస్తుతం ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజుకు సన్నిహితంగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న రాజిరెడ్డికి వర్ధన్నపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవి దక్కింది. ఈ నేపథ్యంలో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి స్వగ్రామం దమ్మన్నపేటకు చేరుకున్న ఆయనకు గ్రామస్తులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా, కార్యకర్తలు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. రాజిరెడ్డి రాక సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ అభినందనలు తెలిపారు. తనకు పీఏసీఎస్‌ చైర్మన్‌ బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజుతో పాటు పార్టీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
#తండ్రి విగ్రహానికి పూలమాల వేసి..
అనంతరం అబ్బిడి రాజిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తండ్రి ఆశయాలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలతో మమేకమయ్యారు.పీఏసీఎస్‌ చైర్మన్‌గా రైతులకు మెరుగైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని రాజిరెడ్డి తెలిపారు. రైతులకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా కృషి చేయడంతో పాటు సొసైటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. సొసైటీ ద్వారా రైతులకు అందాల్సిన సేవలు పారదర్శకంగా, సమర్థవంతంగా అందేలా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి, ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. పీఏసీఎస్‌ పరిధిలోని రైతులు, ప్రజల సహకారంతో ముందుకు సాగుతానని అన్నారు. అందరినీ కలుపుకొని పనిచేస్తూ వర్ధన్నపేట పీఏసీఎస్‌ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.

"అందరి నాయకుడిగా పేరొందిన అబ్బిడి రాజిరెడ్డి"...! - Additional Image"అందరి నాయకుడిగా పేరొందిన అబ్బిడి రాజిరెడ్డి"...! - Additional Image"అందరి నాయకుడిగా పేరొందిన అబ్బిడి రాజిరెడ్డి"...! - Additional Image