Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పల్లవి హైస్కూల్‌ ఉపాధ్యాయులకు జిల్లాస్థాయి అవార్డులు

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 04:27 PM | TELANGANA
పల్లవి హైస్కూల్‌ ఉపాధ్యాయులకు జిల్లాస్థాయి అవార్డులు

వరంగల్: పర్వతగిరి మండలం అన్నారం పల్లవి హైస్కూల్‌ కరస్పాండెంట్‌ గంజి మహేందర్‌, డైరెక్టర్‌ కోటగిరి రమేష్‌ ‘జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు–2026’ అవార్డులకు ఎంపికయ్యారు. వరంగల్‌ డిస్ట్రిక్ట్‌ యునైటెడ్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ (WADUPSA), TRSMA ఆధ్వర్యంలో రంగశాయిపేటలో నిర్వహించిన బెస్ట్‌ టీచర్స్‌ అవార్డ్స్‌ సెరిమనీలో వారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
మహేందర్‌ 30 ఏళ్లుగా, రమేష్‌ 25 ఏళ్లుగా విద్యారంగంలో సేవలందిస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారని నిర్వాహకులు కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్‌ రాచకొండ అశోకచారి వారిని అభినందించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, WADUPSA, TRSMA ప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

పల్లవి హైస్కూల్‌ ఉపాధ్యాయులకు జిల్లాస్థాయి అవార్డులు - Additional Image