Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

32 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కటైన 1994–95 బ్యాచ్ జెడ్పీఎస్‌ఎస్‌ ఇల్లందలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న నాటి సహపాఠులు

Author
Posted By satla anil kumar
| 04 Oct 2026, 07:26 PM | TELANGANA
32 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కటైన 1994–95 బ్యాచ్ జెడ్పీఎస్‌ఎస్‌ ఇల్లందలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న నాటి సహపాఠులు

ఇల్లంద,:
కాలం మారినా.. దూరాలు పెరిగినా.. చిన్ననాటి స్నేహాలకు వయసు అడ్డుకాదని 1994–95 పదో తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు చాటిచెప్పారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత నాటి సహపాఠులంతా ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకోవడంతో జెడ్పీఎస్‌ఎస్‌ ఇల్లంద పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఆదివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి బ్యాచ్‌కు చెందిన పలువురు హాజరై నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఒకే తరగతి గది.. ఒకే బెంచీలు.. గురువుల బోధనలు.. కలిసి చేసిన అల్లరి.. ఆటపాటలు.. స్నేహబంధాలను గుర్తుచేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆనందాన్ని పంచుకున్నారు. అప్పట్లో విద్యార్థులుగా ఉన్న వారు ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడి తమ జీవిత ప్రస్థానాన్ని పరస్పరం పంచుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నప్పటికీ తమ మధ్య ఉన్న ఆత్మీయత, అనుబంధం ఏమాత్రం తగ్గలేదని పలువురు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేశారు. అనంతరం అందరూ కలిసి భోజనం చేసి ఆత్మీయంగా గడిపారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సమ్మేళనానికి సంబంధించిన ఖర్చుల వివరాలను నిర్వాహకులు లెక్కించి తెలుసుకున్నారు. 32 ఏళ్ల తర్వాత జరిగిన ఈ కలయిక తమ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
“సంవత్సరాలు మారినా స్నేహం మారదు..
దూరాలు పెరిగినా జ్ఞాపకాలు దూరం కావు..
మన 1994–95 బ్యాచ్‌ ఎప్పటికీ ఒక్కటే” అంటూ భావోద్వేగాన్ని పంచుకున్నారు.

32 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కటైన 1994–95 బ్యాచ్ జెడ్పీఎస్‌ఎస్‌ ఇల్లందలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న నాటి సహపాఠులు - Additional Image