ప్రేమ పేరుతో మోసం చేశారంటూ యువతి ఆందోళన
యువతి ఆందోళన విషయం తెలుసుకున్న బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు, పలువురు స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెకు సంఘీభావం తెలిపారు. తనకు జరిగిన విషయంపై ఇప్పటికే ఎమ్మెల్యేను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరినా సమస్య పరిష్కారం కాలేదని యువతి కుటుంబసభ్యులు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి యువతి సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని వారు కోరారు. యువతి చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.