Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నాలుగు దశాబ్దాలైనా మారని భారతీయుల స్ఫూర్తి

నాలుగు దశాబ్దాలైనా మారని భారతీయుల స్ఫూర్తి

న్యూఢిల్లీ : వేల అడుగుల ఎత్తులో విమానం.. ఒక్కసారిగా ప్రమాదంలో చిక్కుకుంటే ప్రయాణికుల పరిస్థితి ఊహించలేం. అలాంటి విపత్కర వేళ పైలట్, సిబ్బంది తీసుకునే ఒక్క నిర్ణయం వందలాది ప్రాణాలను కాపాడగలదు. దాదాపు నాలుగు దశాబ్దాల వ్యవధిలో ఇలాంటి అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన ఇద్దరు భారతీయులు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. వారే నీరజ భనోత్, కెప్టెన్ స్మిత్ మచ్చర్.

నీరజతో మొదలై..

1986 సెప్టెంబర్‌ 5న కరాచీ విమానాశ్రయంలో పాన్‌ ఆమ్‌ ఫ్లైట్‌ 73ను ఉగ్రవాదులు హైజాక్‌ చేశారు. విమానంలోని వందలాది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఆ సమయంలో సీనియర్‌ ఫ్లైట్‌ పర్సర్‌గా ఉన్న నీరజ భనోత్‌ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. ప్రయాణికుల పాస్‌పోర్ట్‌లను సేకరించిన ఆమె.. అమెరికన్‌ పౌరులను గుర్తించేందుకు వీలుకాకుండా కొన్ని పాస్‌పోర్ట్‌లను దాచిపెట్టారు. కాల్పులు ప్రారంభమైన సమయంలో ప్రయాణికులను అత్యవసర నిష్క్రమణల వైపు తరలించేందుకు కృషి చేశారు. పిల్లలను కాపాడే క్రమంలో ఉగ్రవాదుల కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆమె సాహసానికి భారత ప్రభుత్వం మరణానంతరం అశోక చక్ర పురస్కారంతో గౌరవించింది. పాకిస్థాన్‌ కూడా ‘తమ్ఘా-ఎ-ఇన్సానియత్‌’తో సత్కరించింది.

ఇవి కూడా చదవండి

2026లో మరో సాహసం..

సెప్టెంబర్‌ 30, 2026న దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో కాక్‌పిట్‌లో తీవ్ర ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌పై సహచర పైలట్‌ కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్‌ విమాన భద్రతపై దృష్టి సారించారు. అనంతరం విమానాన్ని దారి మళ్లించి సౌదీ అరేబియాలోని తబూక్‌లో సురక్షితంగా ల్యాండ్‌ చేసినట్లు సమాచారం. స్మిత్‌ను ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

నీరజ భనోత్‌ నుంచి స్మిత్‌ మచ్చర్‌ వరకు.. కాలం మారినా, పరిస్థితులు మారినా.. కర్తవ్యానికి, మానవత్వానికి ప్రాణాలకంటే విలువనిచ్చే భారతీయుల స్ఫూర్తి మాత్రం మారలేదనే విషయాన్ని ఈ రెండు ఘటనలు గుర్తుచేస్తున్నాయి.