నాలుగు దశాబ్దాలైనా మారని భారతీయుల స్ఫూర్తి
న్యూఢిల్లీ : వేల అడుగుల ఎత్తులో విమానం.. ఒక్కసారిగా ప్రమాదంలో చిక్కుకుంటే ప్రయాణికుల పరిస్థితి ఊహించలేం. అలాంటి విపత్కర వేళ పైలట్, సిబ్బంది తీసుకునే ఒక్క నిర్ణయం వందలాది ప్రాణాలను కాపాడగలదు. దాదాపు నాలుగు దశాబ్దాల వ్యవధిలో ఇలాంటి అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన ఇద్దరు భారతీయులు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. వారే నీరజ భనోత్, కెప్టెన్ స్మిత్ మచ్చర్. నీరజతో మొదలై.. 1986 సెప్టెంబర్ 5న కరాచీ విమానాశ్రయంలో పాన్ ఆమ్ ఫ్లైట్ 73ను ఉగ్రవాదులు హైజాక్ చేశారు. విమానంలోని వందలాది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఆ సమయంలో సీనియర్ ఫ్లైట్ పర్సర్‌గా ఉన్న నీరజ భనోత్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. ప్రయాణికుల పాస్‌పోర్ట్‌లను...