నాలుగు దశాబ్దాలైనా మారని భారతీయుల స్ఫూర్తి
నీరజతో మొదలై..
1986 సెప్టెంబర్ 5న కరాచీ విమానాశ్రయంలో పాన్ ఆమ్ ఫ్లైట్ 73ను ఉగ్రవాదులు హైజాక్ చేశారు. విమానంలోని వందలాది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఆ సమయంలో సీనియర్ ఫ్లైట్ పర్సర్‌గా ఉన్న నీరజ భనోత్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. ప్రయాణికుల పాస్‌పోర్ట్‌లను సేకరించిన ఆమె.. అమెరికన్ పౌరులను గుర్తించేందుకు వీలుకాకుండా కొన్ని పాస్‌పోర్ట్‌లను దాచిపెట్టారు. కాల్పులు ప్రారంభమైన సమయంలో ప్రయాణికులను అత్యవసర నిష్క్రమణల వైపు తరలించేందుకు కృషి చేశారు. పిల్లలను కాపాడే క్రమంలో ఉగ్రవాదుల కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆమె సాహసానికి భారత ప్రభుత్వం మరణానంతరం అశోక చక్ర పురస్కారంతో గౌరవించింది. పాకిస్థాన్ కూడా ‘తమ్ఘా-ఎ-ఇన్సానియత్’తో సత్కరించింది.
2026లో మరో సాహసం..
సెప్టెంబర్ 30, 2026న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కాక్‌పిట్‌లో తీవ్ర ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై సహచర పైలట్ కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ విమాన భద్రతపై దృష్టి సారించారు. అనంతరం విమానాన్ని దారి మళ్లించి సౌదీ అరేబియాలోని తబూక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు సమాచారం. స్మిత్‌ను ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
నీరజ భనోత్ నుంచి స్మిత్ మచ్చర్ వరకు.. కాలం మారినా, పరిస్థితులు మారినా.. కర్తవ్యానికి, మానవత్వానికి ప్రాణాలకంటే విలువనిచ్చే భారతీయుల స్ఫూర్తి మాత్రం మారలేదనే విషయాన్ని ఈ రెండు ఘటనలు గుర్తుచేస్తున్నాయి.