Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చిట్టీల పేరుతో రూ.10 కోట్లకు పైగా వసూళ్లు?

Author
Posted By Telangana Gontuka
| 27 Sep 2026, 07:42 PM | TELANGANA
చిట్టీల పేరుతో రూ.10 కోట్లకు పైగా వసూళ్లు?

సూర్యాపేట: చిట్టీల నిర్వహణ పేరుతో వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కనిపించకుండా పోవడం సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతోంది. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం శెట్టిగూడెం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న భానోత్‌ రాజుపై బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన రూ.10 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చెబుతూ బాధితులు ఎస్పీని ఆశ్రయించారు.
లక్ష్మీనాయక్‌ తండా, బోట్య తండా, ఏనెగంటి తండా, శెట్టిగూడెం, పిల్లలమర్రి తదితర ప్రాంతాలతో పాటు సుమారు 12 గ్రామాలకు చెందిన ప్రజలు, బంధువులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. కొందరికి ప్రామిసరీ నోట్లు ఇచ్చారని, మరికొందరికి నెలవారీ వాయిదాల పద్ధతిలో అధిక మొత్తంలో తిరిగి చెల్లిస్తానని నమ్మించినట్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లో ఉందని బాధితులు చెబుతున్నారు. తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వారు పోలీసులను కోరుతున్నారు. ఆరోపణలపై పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.