చిట్టీల పేరుతో రూ.10 కోట్లకు పైగా వసూళ్లు?
సూర్యాపేట: చిట్టీల నిర్వహణ పేరుతో వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కనిపించకుండా పోవడం సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతోంది. ఆత్మకూర్(ఎస్) మండలం శెట్టిగూడెం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న భానోత్ రాజుపై బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన రూ.10 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చెబుతూ బాధితులు ఎస్పీని ఆశ్రయించారు. లక్ష్మీనాయక్ తండా, బోట్య తండా, ఏనెగంటి తండా, శెట్టిగూడెం, పిల్లలమర్రి తదితర ప్రాంతాలతో పాటు సుమారు 12 గ్రామాలకు చెందిన ప్రజలు, బంధువులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. కొందరికి ప్రామిసరీ నోట్లు ఇచ్చారని, మరికొందరికి నెలవారీ వాయిదాల పద్ధతిలో...