చిట్టీల పేరుతో రూ.10 కోట్లకు పైగా వసూళ్లు?
లక్ష్మీనాయక్ తండా, బోట్య తండా, ఏనెగంటి తండా, శెట్టిగూడెం, పిల్లలమర్రి తదితర ప్రాంతాలతో పాటు సుమారు 12 గ్రామాలకు చెందిన ప్రజలు, బంధువులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. కొందరికి ప్రామిసరీ నోట్లు ఇచ్చారని, మరికొందరికి నెలవారీ వాయిదాల పద్ధతిలో అధిక మొత్తంలో తిరిగి చెల్లిస్తానని నమ్మించినట్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉందని బాధితులు చెబుతున్నారు. తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వారు పోలీసులను కోరుతున్నారు. ఆరోపణలపై పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.