Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రూ.4 కోట్ల అద్దె బకాయిలు.. కుడా షాపింగ్ కాంప్లెక్స్ సీజ్

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 07:35 AM | TELANGANA
రూ.4 కోట్ల అద్దె బకాయిలు.. కుడా షాపింగ్ కాంప్లెక్స్ సీజ్

హన్మకొండ కొత్త బస్టాండ్ కూడలిలోని కుడా షాపింగ్ కాంప్లెక్స్‌కు సుమారు రూ.4 కోట్ల అద్దె బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. గత రెండేళ్లుగా లీజుదారుడు అద్దె చెల్లించకపోవడంతో కుడా అధికారులు శుక్రవారం షాపింగ్ కాంప్లెక్స్‌ను సీజ్ చేశారు. బకాయిలు చెల్లించాలంటూ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
నిబంధనల ప్రకారం రెండు, మూడు నెలలకోసారి అద్దె వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతకాలం బకాయిలు పేరుకుపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లీజుదారుడు అధికార పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ కావడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంపై సదరు మాజీ కార్పొరేటర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం.
నిబంధనలు ఉల్లంఘించారా?
కుడా షాపింగ్ కాంప్లెక్స్ లీజు విషయంలోనూ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లీజు ఒప్పందం ప్రకారం 3 నుంచి 6 నెలల ముందస్తు అద్దె డిపాజిట్ చేయడంతో పాటు బ్యాంకు గ్యారంటీ తీసుకోవాల్సి ఉండగా, అవేమీ లేకుండానే టెండర్ ఖరారు చేసి కాంప్లెక్స్‌ను అద్దెకిచ్చినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారనే ఆరోపణలు ఉన్నాయి. భారీగా అద్దె బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో కుడా ఆదాయ వనరుల నిర్వహణపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.