రూ.4 కోట్ల అద్దె బకాయిలు.. కుడా షాపింగ్ కాంప్లెక్స్ సీజ్
హన్మకొండ కొత్త బస్టాండ్ కూడలిలోని కుడా షాపింగ్ కాంప్లెక్స్‌కు సుమారు రూ.4 కోట్ల అద్దె బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. గత రెండేళ్లుగా లీజుదారుడు అద్దె చెల్లించకపోవడంతో కుడా అధికారులు శుక్రవారం షాపింగ్ కాంప్లెక్స్‌ను సీజ్ చేశారు. బకాయిలు చెల్లించాలంటూ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం రెండు, మూడు నెలలకోసారి అద్దె వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతకాలం బకాయిలు పేరుకుపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లీజుదారుడు అధికార పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ కావడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంపై సదరు మాజీ కార్పొరేటర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. నిబంధనలు...