రూ.4 కోట్ల అద్దె బకాయిలు.. కుడా షాపింగ్ కాంప్లెక్స్ సీజ్
నిబంధనల ప్రకారం రెండు, మూడు నెలలకోసారి అద్దె వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతకాలం బకాయిలు పేరుకుపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లీజుదారుడు అధికార పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ కావడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంపై సదరు మాజీ కార్పొరేటర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం.
నిబంధనలు ఉల్లంఘించారా?
కుడా షాపింగ్ కాంప్లెక్స్ లీజు విషయంలోనూ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లీజు ఒప్పందం ప్రకారం 3 నుంచి 6 నెలల ముందస్తు అద్దె డిపాజిట్ చేయడంతో పాటు బ్యాంకు గ్యారంటీ తీసుకోవాల్సి ఉండగా, అవేమీ లేకుండానే టెండర్ ఖరారు చేసి కాంప్లెక్స్‌ను అద్దెకిచ్చినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారనే ఆరోపణలు ఉన్నాయి. భారీగా అద్దె బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో కుడా ఆదాయ వనరుల నిర్వహణపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.