Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

శబరిమల బంగారం కేసులో మరో సంచలనం

శబరిమల బంగారం కేసులో మరో సంచలనం

శబరిమల: శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో అరెస్టులు కొనసాగుతున్న వేళ మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన 55.72 సవర్లు, అంటే సుమారు 446 గ్రాముల బరువున్న బంగారు కిరీటం కనిపించకుండా పోయినట్లు సమాచారం. దాని స్థానంలో కేవలం 240 గ్రాముల బరువున్న నకిలీ కిరీటాన్ని ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి.
అసలు కిరీటం స్థానంలో తక్కువ బరువున్న నకిలీ కిరీటాన్ని ఎలా ఉంచారు? స్ట్రాంగ్‌ రూమ్‌ భద్రత, రికార్డుల నిర్వహణలో ఏమైనా లోపాలు జరిగాయా? అనే అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు బంగారు కిరీటం సురక్షితంగానే ఉందని ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కిరీటం మాయమైనట్లు వస్తున్న వార్తలు, బోర్డు ప్రకటన మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. అసలు కిరీటం ఎక్కడ ఉంది? నకిలీ కిరీటం వ్యవహారం ఏమిటి? అనే విషయాలపై దర్యాప్తు అనంతరం స్పష్టత రావాల్సి ఉంది. కేసులో ఇప్పటికే పలువురి అరెస్టులు జరగడంతో తాజా పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.