శబరిమల బంగారం కేసులో మరో సంచలనం
అసలు కిరీటం స్థానంలో తక్కువ బరువున్న నకిలీ కిరీటాన్ని ఎలా ఉంచారు? స్ట్రాంగ్ రూమ్ భద్రత, రికార్డుల నిర్వహణలో ఏమైనా లోపాలు జరిగాయా? అనే అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు బంగారు కిరీటం సురక్షితంగానే ఉందని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కిరీటం మాయమైనట్లు వస్తున్న వార్తలు, బోర్డు ప్రకటన మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. అసలు కిరీటం ఎక్కడ ఉంది? నకిలీ కిరీటం వ్యవహారం ఏమిటి? అనే విషయాలపై దర్యాప్తు అనంతరం స్పష్టత రావాల్సి ఉంది. కేసులో ఇప్పటికే పలువురి అరెస్టులు జరగడంతో తాజా పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.