శబరిమల బంగారం కేసులో మరో సంచలనం
శబరిమల: శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో అరెస్టులు కొనసాగుతున్న వేళ మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన 55.72 సవర్లు, అంటే సుమారు 446 గ్రాముల బరువున్న బంగారు కిరీటం కనిపించకుండా పోయినట్లు సమాచారం. దాని స్థానంలో కేవలం 240 గ్రాముల బరువున్న నకిలీ కిరీటాన్ని ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు కిరీటం స్థానంలో తక్కువ బరువున్న నకిలీ కిరీటాన్ని ఎలా ఉంచారు? స్ట్రాంగ్ రూమ్ భద్రత, రికార్డుల నిర్వహణలో ఏమైనా లోపాలు జరిగాయా? అనే అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు బంగారు కిరీటం సురక్షితంగానే ఉందని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో...