Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పీడియాట్రిక్‌ ఐసీయూలో రాప్తాడు బాలిక.. ఆరోగ్యం నిలకడగా ఉంది: లోకేశ్‌

Author
Posted By Telangana Gontuka
| 02 Nov 2026, 12:01 PM | ANDHRA PRADESH
పీడియాట్రిక్‌ ఐసీయూలో రాప్తాడు బాలిక.. ఆరోగ్యం నిలకడగా ఉంది: లోకేశ్‌

AP : రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికకు బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఆర్థోపెడిక్‌, ప్లాస్టిక్‌ సర్జరీలు విజయవంతంగా పూర్తయ్యాయని, వైద్యులు 12 గంటల పాటు శ్రమించారని వెల్లడించారు. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. బాలిక పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అత్యుత్తమ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్యులతో మాట్లాడిన లోకేశ్‌.. చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.