AP : రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికకు బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలు విజయవంతంగా పూర్తయ్యాయని, వైద్యులు 12 గంటల పాటు శ్రమించారని వెల్లడించారు. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. బాలిక పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అత్యుత్తమ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్యులతో మాట్లాడిన లోకేశ్.. చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.