Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అంగన్వాడి సేవలు అర్హులైన అందరూ వినియోగించుకోవాలి

Author
Posted By Marupatla venu
| 09 Oct 2026, 09:11 PM | TELANGANA
అంగన్వాడి సేవలు అర్హులైన అందరూ వినియోగించుకోవాలి

జఫర్గడ్ అక్టోబర్ 9 తెలంగాణ గొంతుక మండలంలోని రఘునాథపల్లి, కునూరు గ్రామాలను బిజెపి మండల కమిటీ తరఫున అంగన్వాడి సెంటర్లను సందర్శించి అంగన్వాడి టీచర్లను, ఆయాలను సాలువాలతో సన్మానించడం జరిగిందని బిజెపి మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనగామ జిల్లా మహిళా మోర్చా ఇంచార్జ్ తులసి కళ్యాణి హాజరై వారు మాట్లాడుతూ నరేంద్ర మోధీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగానే చిన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడుతున్న అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు సన్మాన కార్యక్రమం నిర్వహించామని అనంతరం పిల్లలతో బతుకమ్మ ఆటలు పిల్లలకు స్నాక్స్ అందించామని తెలిపారు అంగన్వాడి ద్వారా పిల్లలకు గర్భిణీ స్త్రీలకు పాలు గుడ్లు బాలామృతం వంటివి అర్హులైన అందరూ వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో చేతివృద్ధుల సెల్ జిల్లా కన్వీనర్ పోతోజు ఎల్లా చారి, ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి ఇల్లందుల సారయ్య, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తీగారపు బుచ్చయ్య, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అన్యపు రమేష్, బూత్ అధ్యక్షుడు నారెల్లి వెంకటేష్, కాబట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు

అంగన్వాడి సేవలు అర్హులైన అందరూ వినియోగించుకోవాలి - Additional Image