Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

AI నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు: అశ్వినీ వైష్ణవ్

Author
Posted By Telangana Gontuka
| 08 Oct 2026, 04:59 PM | NATIONAL
AI నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు: అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ : కృత్రిమ మేధస్సు (AI) నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం సిద్ధం చేస్తామని చెప్పారు. AI భద్రత, డీప్‌ఫేక్‌లను ఇందులో కీలక అంశాలుగా చేర్చనున్నట్లు వెల్లడించారు. డీప్‌ఫేక్‌ల నాణ్యత పెరుగుతుండటంతో అవి సమాజంలో తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నాయని, AI నియంత్రణకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. AIని ఎలా నియంత్రించాలనే అంశంపై ప్రజలు, నిపుణుల అభిప్రాయాలను స్వీకరిస్తామని తెలిపారు.