AI నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు: అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ : కృత్రిమ మేధస్సు (AI) నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం సిద్ధం చేస్తామని చెప్పారు. AI భద్రత, డీప్‌ఫేక్‌లను ఇందులో కీలక అంశాలుగా చేర్చనున్నట్లు వెల్లడించారు. డీప్‌ఫేక్‌ల నాణ్యత పెరుగుతుండటంతో అవి సమాజంలో తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నాయని, AI నియంత్రణకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. AIని ఎలా నియంత్రించాలనే అంశంపై ప్రజలు, నిపుణుల అభిప్రాయాలను స్వీకరిస్తామని తెలిపారు.