Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

లంచం డిమాండ్‌.. సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెన్షన్

Author
Posted By Telangana Gontuka
| 08 Oct 2026, 10:24 AM | TELANGANA
లంచం డిమాండ్‌.. సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెన్షన్

కరీంనగర్‌: జేసీబీ, ట్రాక్టర్ల విడుదలకు లంచం డిమాండ్‌ చేసి వసూలు చేసిన ఆరోపణలపై తిమ్మాపూర్‌ సీఐ బొల్లం రమేశ్‌, ఎస్సై అన్వర్‌, ఓ కానిస్టేబుల్‌ను మల్టీజోన్‌-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
చలానాలు చెల్లించి తహసీల్దార్‌ నుంచి వాహనాల విడుదలకు ఉత్తర్వులు తెచ్చినప్పటికీ వాటిని విడుదల చేయకుండా రూ.లక్ష డిమాండ్‌ చేసినట్లు విచారణలో తేలింది. చివరకు రూ.50 వేలకు బేరం కుదుర్చుకుని డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ కావడంతో ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.