లంచం డిమాండ్.. సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
కరీంనగర్: జేసీబీ, ట్రాక్టర్ల విడుదలకు లంచం డిమాండ్ చేసి వసూలు చేసిన ఆరోపణలపై తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, ఎస్సై అన్వర్, ఓ కానిస్టేబుల్‌ను మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చలానాలు చెల్లించి తహసీల్దార్ నుంచి వాహనాల విడుదలకు ఉత్తర్వులు తెచ్చినప్పటికీ వాటిని విడుదల చేయకుండా రూ.లక్ష డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. చివరకు రూ.50 వేలకు బేరం కుదుర్చుకుని డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ కావడంతో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు.