Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం: ఆరూరి రమేష్‌

Author
Posted By Telangana Gontuka
| 07 Oct 2026, 10:55 PM | TELANGANA
న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం: ఆరూరి రమేష్‌

వరంగల్:వర్ధన్నపేట మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి కుమారుడు పాలకుర్తి శ్రీకాంత్‌పై ఆరోపణలు చేస్తూ గత మూడు రోజులుగా చైర్మన్‌ ఇంటి ముందు టెంట్‌ వేసుకుని మౌన దీక్ష చేస్తున్న దళిత యువతి శ్రీదేవికి బీఆర్‌ఎస్‌ నాయకులు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ గురువారం యువతిని పరామర్శించి ఆమెకు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆరూరి రమేష్‌ మాట్లాడుతూ.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్లుగా యువతితో సన్నిహితంగా ఉన్న శ్రీకాంత్‌ ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని శ్రీదేవి ఆరోపిస్తున్నారని తెలిపారు. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురవుతోందన్నారు. సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి యువతికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
గత మూడు రోజులుగా యువతి చైర్మన్‌ ఇంటి ముందు దీక్ష చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే స్పందించకపోవడంపై ఆరూరి రమేష్‌ ప్రశ్నించారు. దళిత యువతికి అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరారు. శ్రీదేవి, శ్రీకాంత్‌లకు వివాహం జరిగేలా ఇరు కుటుంబాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
యువతికి న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైతే బాధితురాలి తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆరూరి రమేష్‌ స్పష్టం చేశారు. ఈ ఘటనపై అధికారులు కూడా స్పందించి వాస్తవాలను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
ఆరూరి రమేష్‌ వెంట మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అంగోతు అరుణ, పలువురు మున్సిపల్‌ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్‌ పట్టణ, మండల నాయకులు, మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి, మాజీ మార్కెట్‌ చైర్మన్లు గుజ్జ గోపాల్‌రావు, గుజ్జ సంపత్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు, డివిజన్‌ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం: ఆరూరి రమేష్‌ - Additional Image