న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం: ఆరూరి రమేష్
వరంగల్:వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు పాలకుర్తి శ్రీకాంత్‌పై ఆరోపణలు చేస్తూ గత మూడు రోజులుగా చైర్మన్ ఇంటి ముందు టెంట్ వేసుకుని మౌన దీక్ష చేస్తున్న దళిత యువతి శ్రీదేవికి బీఆర్‌ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గురువారం యువతిని పరామర్శించి ఆమెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్లుగా యువతితో సన్నిహితంగా ఉన్న శ్రీకాంత్ ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని శ్రీదేవి ఆరోపిస్తున్నారని తెలిపారు. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురవుతోందన్నారు. సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి యువతికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు....