Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పండగలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కొండా సురేఖ

Author
Posted By Telangana Gontuka
| 06 Oct 2026, 06:09 PM | TELANGANA
పండగలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కొండా సురేఖ

వరంగల్: దసరా, సద్దుల బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని వరంగల్‌లోని రంగలీల మైదానం, ఉర్సు గుట్ట, కరీమాబాద్, ఉర్సు ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మాజీ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.
సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు బారికేడింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, మరుగుదొడ్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ నిమజ్జనం ప్రాంతాల్లోనూ అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
రావణ వధ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఉత్సవ ప్రాంగణాల్లో తాగునీరు, వైద్య సదుపాయాలు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను స్పష్టంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కొండా సురేఖ స్పష్టం చేశారు. కార్యక్రమాలు పూర్తయ్యే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, మున్సిపల్ కమిషనర్ టి. వెంకన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్, ఉత్సవ కమిటీ సభ్యులు నాగపురి సంజయ్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పండగలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కొండా సురేఖ - Additional Image