పండగలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కొండా సురేఖ
వరంగల్: దసరా, సద్దుల బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని వరంగల్లోని రంగలీల మైదానం, ఉర్సు గుట్ట, కరీమాబాద్, ఉర్సు ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మాజీ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు బారికేడింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, మరుగుదొడ్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ నిమజ్జనం ప్రాంతాల్లోనూ అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రావణ వధ కార్యక్రమానికి భారీగా...