Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మల్లన్నగండి రిజర్వాయర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

Author
Posted By Telangana Gontuka
| 06 Oct 2026, 08:07 AM | TELANGANA
మల్లన్నగండి రిజర్వాయర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

జనగాం జిల్లా:చిల్పూర్ మండలంలోని గార్లగడ్డతండా పంచాయతీ పరిధి మల్లన్నగండి రిజర్వాయర్‌లో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కళ్యాణ్‌ (27) మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళ్యాణ్‌ స్నేహితులతో కలిసి రిజర్వాయర్‌కు వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. రిజర్వాయర్‌లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల పాటు శ్రమించిన అనంతరం మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అనంతరం ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం కోసం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మల్లన్నగండి రిజర్వాయర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి - Additional Image