మల్లన్నగండి రిజర్వాయర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
జనగాం జిల్లా:చిల్పూర్ మండలంలోని గార్లగడ్డతండా పంచాయతీ పరిధి మల్లన్నగండి రిజర్వాయర్‌లో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కళ్యాణ్ (27) మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళ్యాణ్ స్నేహితులతో కలిసి రిజర్వాయర్‌కు వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. రిజర్వాయర్‌లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల పాటు శ్రమించిన అనంతరం మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అనంతరం ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం కోసం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై...