Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

3ఎల్లార్ కాలువ పైన ఆక్రమణ లు లేకుండా చర్యలు తీసుకోవాలీ

Author
Posted By Marupatla venu
| 04 Oct 2026, 08:00 PM | TELANGANA
3ఎల్లార్ కాలువ పైన ఆక్రమణ లు లేకుండా చర్యలు తీసుకోవాలీ

కోరుకొప్పుల నగేష్ గౌడ్


జఫర్గడ్; అక్టోబర్ 4 (తెలంగాణ గొంతుక)
స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుండి 3ఎల్లార్ కాలువ ద్వారా జఫర్గడ్ మండలం లోని తిమ్మంపేట లో తీసిన కాలువ ద్వారా తిమ్మంపేట లోని చెరువు లు నిండి అదేవిధంగా తండాలను కలుపుకొని ఉప్పుగల్లు కూనూరు కొనాయిచలం తిడుగు సాగరం గ్రామాలలో రైతుల కి పంట చెన్లకి నీళ్ళు అందివ్వడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది అని ప్రభుత్వం మంచి ఉద్దేశ్యం తో ఈ కాలువలోకి నీరు వదిలితే కొంత మంది స్వార్థం తో తిమ్మంపేట 3ఎల్లార్ కాలువ ద్వారా నీరు రాకుండా పెద్ద రాతి పలకలను ఇసుక తో నింపిన సంచులను కాలువలో అడ్డుగా వేయడం వల్ల చుక్క నీరు కూడా ఈ గ్రామాలలో రైతులకు అందడం లేదు 3ఎల్ ఆర్ కాలువలో నడుము లోతు నీళ్ళు ఉంటే అవి తిమ్మంపేట కి వచ్చే వరకు ఆ నీరు కనీసం అరికాళ్ళు కూడా తడవడం లేదు రాష్ట్ర మొత్తం కరువు ఛాయలు అలుముకుంటే రావాల్సిన నీరు కూడా రైతులకు అందడం లేదు అని కనీసం అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి కావున ఇరిగేషన్ ఏఈ ని సస్పెండ్ చేసి రైతులకు సకాలంలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు పంటలు పండించలేక వలసలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాము అని తెలిపారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అబ్బరాబోయిన యాకస్వామీ బిజెపి నాయకులు కొమురవెల్లి, రైతులు పాల్గొనడం జరిగింది

3ఎల్లార్ కాలువ పైన ఆక్రమణ లు లేకుండా చర్యలు తీసుకోవాలీ - Additional Image