Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పోలీసులమంటూ లాడ్జిలోకి.. యువతిపై సామూహిక లైంగిక దాడి

పోలీసులమంటూ లాడ్జిలోకి.. యువతిపై సామూహిక లైంగిక దాడి

త్రిస్సూర్‌: కేరళలోని త్రిస్సూర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో లాడ్జిలో ఉన్న యువతిని పోలీసులమంటూ వచ్చిన ముఠా అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమెతో ఉన్న వ్యక్తిని తీవ్రంగా కొట్టి చేతులు, కాళ్లు విరిగేలా చేసి తమిళనాడులోని ఆస్పత్రి వద్ద వదిలేశారు. సెప్టెంబర్‌ 22న జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో యువకుడి భార్య దేవి (27)తో పాటు థామస్‌ ప్రియదర్శన్‌ దేవా, రఘుపతి రాజ్‌, శంకర్‌, బాలరాజ్‌ ఉన్నారు. భర్త మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడన్న కారణంతో దేవి ఈ దాడికి పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లొకేషన్‌ తెలుసుకుని ముఠాకు సమాచారం ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ముఠా లాడ్జి సిబ్బందిని నమ్మించి గదిలోకి ప్రవేశించి ఇద్దరినీ బలవంతంగా తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తమిళనాడులో యువతిపై లైంగిక దాడి జరిగినట్లు వెల్లడించారు. బాధితురాలు ఆస్పత్రి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు కొనసాగుతోంది.