పోలీసులమంటూ లాడ్జిలోకి.. యువతిపై సామూహిక లైంగిక దాడి
త్రిస్సూర్: కేరళలోని త్రిస్సూర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో లాడ్జిలో ఉన్న యువతిని పోలీసులమంటూ వచ్చిన ముఠా అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమెతో ఉన్న వ్యక్తిని తీవ్రంగా కొట్టి చేతులు, కాళ్లు విరిగేలా చేసి తమిళనాడులోని ఆస్పత్రి వద్ద వదిలేశారు. సెప్టెంబర్ 22న జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో యువకుడి భార్య దేవి (27)తో పాటు థామస్ ప్రియదర్శన్ దేవా, రఘుపతి రాజ్, శంకర్, బాలరాజ్ ఉన్నారు. భర్త మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడన్న కారణంతో దేవి ఈ దాడికి పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లొకేషన్ తెలుసుకుని ముఠాకు...