Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పల్లె నుంచి ప్రపంచ వేదికకు..

Author
Posted By Hanumkonda
| 02 Oct 2026, 07:45 PM | INTERNATIONAL, NATIONAL, TELANGANA
పల్లె నుంచి ప్రపంచ వేదికకు..

రాయపర్తి: గ్రామీణ ప్రాంతం నుంచి పరిశోధనా రంగంలో రాణిస్తూ అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుతున్న రాయపర్తి మండలం తిరుమలాయపల్లికి చెందిన యువ పరిశోధకుడు వశపాక అనిల్‌ అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (WCOG-2026) సదస్సులో యంగ్‌ ఇన్వెస్టిగేటర్‌ అవార్డు (YIA) ప్రెజెంటేషన్‌కు ఆయన ఎంపికయ్యారు.

గ్రామ మాజీ సర్పంచ్‌ కుమారస్వామి, వినోద దంపతుల రెండో కుమారుడైన అనిల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్స్‌ జెనెటిక్స్‌ ల్యాబ్‌లో రీసెర్చ్‌ స్కాలర్‌గా, ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా డాక్టర్‌ వి. రవికాంత్‌ పర్యవేక్షణలో పరిశోధనలు చేస్తున్నారు. కొలొరెక్టల్‌ క్యాన్సర్‌పై ఆయన చేస్తున్న పరిశోధనకు అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే అవకాశం దక్కింది.

‘ఇంటిగ్రేటెడ్‌ జెనోమిక్‌ అండ్‌ ట్రాన్స్‌క్రిప్టోమిక్‌ ప్రొఫైలింగ్‌ రివీల్స్‌ డిస్టింక్ట్‌ మాలిక్యులర్‌ ఫీచర్స్‌ ఆఫ్‌ కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ ఇన్‌ యాన్‌ ఇండియన్‌ కోహార్ట్‌’ అంశంపై ఆయన పరిశోధన సాగుతోంది. భారతీయుల్లో కొలొరెక్టల్‌ క్యాన్సర్‌కు సంబంధించిన జన్యుపరమైన మార్పులను గుర్తించడం, భవిష్యత్తులో వ్యక్తిగతీకరించిన వైద్య విధానాలకు దోహదపడే అంశాలపై ఈ పరిశోధన దృష్టి సారించింది.

ఇవి కూడా చదవండి

అనిల్‌ సాధించిన ఘనతపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. AIG హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ జి.వి.రావు, డాక్టర్‌ ఎం.శశికళతో పాటు పరిశోధనకు మార్గదర్శకులైన డాక్టర్‌ వి. రవికాంత్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌ నాయక్‌ అభినందనలు తెలిపారు. తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు మార్గదర్శకులకు అనిల్‌ కృతజ్ఞతలు తెలిపారు.