పల్లె నుంచి ప్రపంచ వేదికకు..
రాయపర్తి: గ్రామీణ ప్రాంతం నుంచి పరిశోధనా రంగంలో రాణిస్తూ అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుతున్న రాయపర్తి మండలం తిరుమలాయపల్లికి చెందిన యువ పరిశోధకుడు వశపాక అనిల్ అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (WCOG-2026) సదస్సులో యంగ్ ఇన్వెస్టిగేటర్ అవార్డు (YIA) ప్రెజెంటేషన్‌కు ఆయన ఎంపికయ్యారు. గ్రామ మాజీ సర్పంచ్ కుమారస్వామి, వినోద దంపతుల రెండో కుమారుడైన అనిల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్స్ జెనెటిక్స్ ల్యాబ్‌లో రీసెర్చ్ స్కాలర్‌గా, ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా డాక్టర్ వి. రవికాంత్ పర్యవేక్షణలో పరిశోధనలు చేస్తున్నారు. కొలొరెక్టల్ క్యాన్సర్‌పై ఆయన చేస్తున్న పరిశోధనకు అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే అవకాశం దక్కింది. ‘ఇంటిగ్రేటెడ్ జెనోమిక్...