Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సౌర విద్యుత్ ఉత్పత్తితో ఎన్నో ప్రయోజనాలు

Author
Posted By Marupatla venu
| 02 Oct 2026, 06:30 PM | Array
సౌర విద్యుత్ ఉత్పత్తితో ఎన్నో ప్రయోజనాలు

స్టేషన్ ఘన్‌పూర్; మున్సిపల్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు ఎన్పీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పాల్వాయి రణధీర్ రెడ్డి అధ్యక్షతన వరుసగా రెండో రోజు నిర్వహించిన ఈసదస్సుకు వినియోగదారుల నుండి మంచి స్పందన లభించింది ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రెడ్కో డిఎం ఘంధం రాజేందర్ మాట్లాడుతూ వినియోగదారులు తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించారు,నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని,కరెంట్ బిల్లు భారం దాదాపు తగ్గిపోతుందని తెలిపారు,కేంద్ర ప్రభుత్వం ఒక కిలోవాట్‌కు 30వేలు,రెండు కిలోవాట్లకు 60వేలు,మూడు కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్టంగా 78వేల రూపాయల వరకు సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని చెప్పారు,అవసరానికి మించి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను డిస్కమ్‌కు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చని,తక్కువ వడ్డీతో బ్యాంకు రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉందన్నారు,దేశ వ్యాప్తంగా కోటి కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించి లబ్ధి చేకూర్చడంతో పాటు,పర్యావరణ పరిరక్షణ,పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈపథకం ప్రధాన లక్ష్యమని ఈసందర్బంగా డిఎం రాజేందర్ తెలిపారు సేవా-సేతు కార్యక్రమంలో భాగంగా టీజీఎన్పీడీసీఎల్,తెలంగాణ రెడ్కో,వివిధ బ్యాంకుల అధికారులు,సోలార్ వెండర్లు ఒకే వేదికపై అందుబాటులో ఉన్నారని,ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు,దరఖాస్తు విధానం,అర్హతలు,కావాల్సిన పత్రాలపై అధికారులు ప్రత్యక్షంగా వివరించారు,మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ సేవా-సేతు అవగాహన సదస్సు శనివారంతో ముగుస్తుందని,ఘన్‌పూర్ డివిజన్ పరిధిలోని గృహ వినియోగదారులందరూ ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలని రెడ్కో డిఎం కోరారు,ఈకార్యక్రమంలో ఎన్పిడిసీఎల్ డిఈ బి.సారయ్య,రెడ్కో ఫీల్డ్ అధికారి నవీన్ కుమార్ యాదవ్,ఏఈలు పి.శంకర్,ఎం.కరుణాకర్,ఎస్ఎల్ఐ నీలం ఐలేష్,లైన్మెన్లు వాసం శ్రీధర్,అన్వర్ పాషా,ఎ.సదన్,బి.రమేష్,పి.మల్లేష్,జి.శేఖర్,బ్యాంక్ అధికారులు,సోలార్ వెండర్లు,విద్యుత్ సిబ్బంది మరియు వినియోగదారులు పాల్గొన్నారు.