సౌర విద్యుత్ ఉత్పత్తితో ఎన్నో ప్రయోజనాలు
స్టేషన్ ఘన్పూర్; మున్సిపల్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు ఎన్పీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పాల్వాయి రణధీర్ రెడ్డి అధ్యక్షతన వరుసగా రెండో రోజు నిర్వహించిన ఈసదస్సుకు వినియోగదారుల నుండి మంచి స్పందన లభించింది ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రెడ్కో డిఎం ఘంధం రాజేందర్ మాట్లాడుతూ వినియోగదారులు తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించారు,నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని,కరెంట్ బిల్లు భారం దాదాపు తగ్గిపోతుందని తెలిపారు,కేంద్ర ప్రభుత్వం ఒక కిలోవాట్‌కు 30వేలు,రెండు...