Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నల్లబెల్లిలో వినూత్నంగా స్వచ్ఛత కార్యక్రమం

Author
Posted By Telangana Gontuka
| 02 Oct 2026, 12:17 PM | TELANGANA
నల్లబెల్లిలో వినూత్నంగా స్వచ్ఛత కార్యక్రమం

వరంగల్:మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక గ్రామసభ అనంతరం సర్పంచ్‌ జక్కి అనిత శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో గ్రామ బస్టాండ్‌ ప్రాంగణంలో నూతన రచ్చబండలను నిర్మించారు.
ఈ రచ్చబండలపై తడి చెత్త, పొడి చెత్త, సానిటరీ చెత్త, ప్రత్యేక చెత్తను వేర్వేరుగా సేకరించే విధానంపై ప్రభుత్వ మార్గదర్శకాలను ఏర్పాటు చేశారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నాలుగు రకాల వ్యర్థాలను వేరు చేసి పారిశుధ్యాన్ని కాపాడాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ మేకల దేవేందర్‌, గ్రామ కార్యదర్శి షేక్‌ హుస్సేన్‌, వార్డు సభ్యులు, గ్రామస్థాయి అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు, యువకులు పాల్గొన్నారు.

నల్లబెల్లిలో వినూత్నంగా స్వచ్ఛత కార్యక్రమం - Additional Image