నల్లబెల్లిలో వినూత్నంగా స్వచ్ఛత కార్యక్రమం
ఈ రచ్చబండలపై తడి చెత్త, పొడి చెత్త, సానిటరీ చెత్త, ప్రత్యేక చెత్తను వేర్వేరుగా సేకరించే విధానంపై ప్రభుత్వ మార్గదర్శకాలను ఏర్పాటు చేశారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నాలుగు రకాల వ్యర్థాలను వేరు చేసి పారిశుధ్యాన్ని కాపాడాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేకల దేవేందర్, గ్రామ కార్యదర్శి షేక్ హుస్సేన్, వార్డు సభ్యులు, గ్రామస్థాయి అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు, యువకులు పాల్గొన్నారు.