Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గాంధీజీ ఆశయాలను ఆచరించాలి: సారంగపాణి

Author
Posted By Telangana Gontuka
| 02 Oct 2026, 11:56 AM | TELANGANA
గాంధీజీ ఆశయాలను ఆచరించాలి: సారంగపాణి

వరంగల్:జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ సారంగపాణి మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. సమాజ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు.
గాంధీజీ స్వచ్ఛతకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ వర్ధన్నపేట మున్సిపాలిటీని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతను కాపాడటంతో పాటు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా ప్రజలు సహకరించాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ నేతావత్ శిభారాణి, కౌన్సిలర్లు, అధికారులు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

గాంధీజీ ఆశయాలను ఆచరించాలి: సారంగపాణి - Additional Image