గాంధీజీ ఆశయాలను ఆచరించాలి: సారంగపాణి
వరంగల్:జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ సారంగపాణి మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. సమాజ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. గాంధీజీ స్వచ్ఛతకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ వర్ధన్నపేట మున్సిపాలిటీని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతను కాపాడటంతో పాటు తడి,...