Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తల్లీకుమార్తెపై కత్తితో దాడి.. కుమార్తె మృతి

Author
Posted By Telangana Gontuka
| 02 Oct 2026, 08:22 AM | TELANGANA
తల్లీకుమార్తెపై కత్తితో దాడి.. కుమార్తె మృతి

హన్మకొండ:పరకాల పట్టణంలోని ఆకులవాడలో తల్లీకుమార్తెపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో సుగుణమ్మ (63) మృతి చెందగా, ఆమె తల్లి లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమెను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇంటి తలుపులు తెరవకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా తల్లీకుమార్తె రక్తపు గాయాలతో కనిపించినట్లు సమాచారం. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా సుగుణమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. దాడికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.