తల్లీకుమార్తెపై కత్తితో దాడి.. కుమార్తె మృతి
ఇంటి తలుపులు తెరవకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా తల్లీకుమార్తె రక్తపు గాయాలతో కనిపించినట్లు సమాచారం. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా సుగుణమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. దాడికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.