Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

లారీ ఓనర్స్ అసోసియేషన్ లెక్కలు వెల్లడించాలి

Author
Posted By Telangana Gontuka
| 01 Oct 2026, 04:13 PM | TELANGANA
లారీ ఓనర్స్ అసోసియేషన్ లెక్కలు వెల్లడించాలి

వరంగల్: లారీ ఓనర్స్ అసోసియేషన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల పూర్తి వివరాలను సభ్యుల సమక్షంలో వెల్లడించాలని సంఘం ప్రస్తుత అధ్యక్షుడు వేముల భూపాల్ డిమాండ్ చేశారు. సంఘం ప్రస్తుత లావాదేవీలతో పాటు మాజీ అధ్యక్షుడు వంగాల సమ్మిరెడ్డి హయాంలో జరిగిన ఆర్థిక లావాదేవీల లెక్కలను కూడా సభ్యులకు అందుబాటులో ఉంచాలని కోరారు.
సంఘం వ్యవహారాల్లో పారదర్శకత కోసం ఆదాయం, ఖర్చులకు సంబంధించిన వివరాలను సభ్యుల ముందు వెల్లడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భూపాల్ తెలిపారు. మాజీ అధ్యక్షుడి హయాంలోని లెక్కలను కూడా బహిరంగంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. వివరాలు వెల్లడించకపోతే లారీ యజమానులతో కలిసి సమ్మిరెడ్డి, సదానందం ఇళ్ల ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని భూపాల్ హెచ్చరించారు.