లారీ ఓనర్స్ అసోసియేషన్ లెక్కలు వెల్లడించాలి
సంఘం వ్యవహారాల్లో పారదర్శకత కోసం ఆదాయం, ఖర్చులకు సంబంధించిన వివరాలను సభ్యుల ముందు వెల్లడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భూపాల్ తెలిపారు. మాజీ అధ్యక్షుడి హయాంలోని లెక్కలను కూడా బహిరంగంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. వివరాలు వెల్లడించకపోతే లారీ యజమానులతో కలిసి సమ్మిరెడ్డి, సదానందం ఇళ్ల ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని భూపాల్ హెచ్చరించారు.