Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నిరూప్‌నగర్‌లో కొండచిలువ కలకలం

Author
Posted By Telangana Gontuka
| 01 Oct 2026, 06:58 AM | TELANGANA
నిరూప్‌నగర్‌లో కొండచిలువ కలకలం

వరంగల్: గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్‌ కోమటిపల్లి ప్రాంతంలోని నిరూప్‌నగర్‌లో కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మధుతండా నుంచి బొడ్రాయి వెళ్లే మార్గంలోని ఓపెన్ ప్లేస్‌ ప్రహరీ నుంచి కొండచిలువ బయటకు వచ్చింది. దీన్ని గమనించిన స్థానికులు ఆందోళన చెందగా, కొద్దిసేపటి తర్వాత అది సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు స్పందించి కొండచిలువను సురక్షితంగా పట్టుకుని తరలించాలని స్థానికులు కోరుతున్నారు.