Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సీఎం రేవంత్‌ పర్యటన.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హాజరు

Author
Posted By Telangana Gontuka
| 30 Sep 2026, 10:16 PM | Politics, TELANGANA
సీఎం రేవంత్‌ పర్యటన.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హాజరు

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ కూడా పాల్గొన్నారు. సిరిసిల్లలో రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులు ఇందులో ఉన్నాయి. సిరిసిల్ల, వేములవాడ తదితర ప్రాంతాల్లో తహసీల్దార్‌, ఆర్డీవో, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, గోదాములు, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టారు.

కాగా, సీఎం పర్యటనలో భాగంగా కరీంనగర్‌లో నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించిన కార్యక్రమంలోనూ బండి సంజయ్‌ పాల్గొన్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.