సీఎం రేవంత్‌ పర్యటన.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హాజరు

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ కూడా పాల్గొన్నారు. సిరిసిల్లలో రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులు ఇందులో ఉన్నాయి. సిరిసిల్ల, వేములవాడ తదితర ప్రాంతాల్లో తహసీల్దార్‌, ఆర్డీవో, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, గోదాములు, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టారు. కాగా, సీఎం పర్యటనలో భాగంగా కరీంనగర్‌లో నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించిన కార్యక్రమంలోనూ బండి...