Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పట్టభద్రుల ఎమ్మెల్సీ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్*

Author
Posted By Marupatla venu
| 30 Sep 2026, 06:33 PM | Array
పట్టభద్రుల ఎమ్మెల్సీ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్*

జనగాం (తెలంగాణ గొంతుక) వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదలైనట్లు *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు. 2026 నవంబర్ 1ని అర్హత తేదీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.01-11-2026 నాటికి కనీసం 3 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన అర్హత కలిగిన అభ్యర్థులు Form-18 దరఖాస్తును AEROలకు (లేదా) నియమిత అధికారికి సమర్పించాలన్నారు.
నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తులు స్వీకరిస్తారు.నవంబర్ 20 వరకు ముసాయిదా జాబితా తయారీ, ముద్రణ ప్రక్రియ పూర్తి చేసి, నవంబర్ 25న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.అదే రోజు నుంచి డిసెంబర్ 10 వరకు క్లెయిమ్‌లు,అభ్యంతరాలు స్వీకరిస్తారు.
డిసెంబర్ 25లోగా వాటిని పరిష్కరించి, సప్లిమెంట్లను సిద్ధం చేస్తారు.డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్* - Additional Image